Page Loader
Bitcoin: రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్.. 
రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్..

Bitcoin: రికార్డు స్థాయిలో 100,000 డాలర్ల మార్కును దాటిన బిట్‌కాయిన్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

బిట్‌ కాయిన్‌ (Bitcoin) క్రిప్టోకరెన్సీ విలువ ప్రస్తుతం 1,00,000 డాలర్ల (రూ.84 లక్షల పైగా) మార్కును దాటింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో ఈ క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత నాలుగు వారాల్లోనే బిట్‌కాయిన్‌ విలువ 45 శాతం పెరిగింది, ఇది దాని దూకుడును స్పష్టం చేస్తోంది. ట్రంప్‌ నిబంధనలను సడలించాలని సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే, ఈ క్రిప్టో కరెన్సీ 1,00,000 డాలర్ల మార్కును క్రాస్‌ చేసింది. ఒక దశలో, బిట్‌కాయిన్‌ విలువ 1,00,512 డాలర్లను కూడా తాకింది.

వివరాలు 

ట్రంప్‌ అమలు చేసిన పాలసీలలో మార్పులు

మడ్‌రెక్స్‌ సీఈవో, ఈ పరిణామాలపై స్పందిస్తూ, "బిట్‌కాయిన్‌ ఈ దూకుడుకు ప్రధాన కారణం మస్క్‌ ద్వారా గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ పెంపొందించడం, అలాగే ట్రంప్‌ అమలు చేసిన పాలసీలలో మార్పులు రావడం. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజీ కమిషన్‌ (SEC) ఛైర్మన్‌గా పాల్‌ అట్కిన్‌ను నియమించడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ పరిణామాల వల్ల క్రిప్టో కరెన్సీకి అనుకూలమైన పాలసీలు రూపు దిద్దే అవకాశాలు పెరిగాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ విలువ 1,20,000 డాలర్లను కూడా చేరవచ్చని అంచనాలు ఉన్నాయి" అని తెలిపారు.