LOADING...
Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతంటే?
బంగారం ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా స్థిరపడగా, వెండి ధరలు కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,235 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650గా ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.2,62,350 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650గా ఉంది. వెండి ధర కిలోకు రూ.2,62,350గా నమోదైంది.

వివరాలు

22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,260

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,010 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,260గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,350, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. కోల్‌కత్తాలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,370గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,500గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,500, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,800 వద్ద కొనసాగుతోంది.

వివరాలు

రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం

ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువలు తగ్గడం వంటి కారణాలతో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ అధికమవుతోంది. అంతేకాకుండా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా చమురు ధరలు పెరిగినప్పుడు బంగారం ధరలపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును కూడా తాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

కొంతమేర తగ్గిన ధరలు

అయితే నగలు కొనుగోలు చేయాలనుకునేవారు ధరలు కొంత తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు పెట్టుబడి కోణంలో చూస్తే, 5 నుంచి 10 సంవత్సరాల దీర్ఘకాలిక వ్యవధిలో బంగారం ఎప్పటికీ లాభదాయక పెట్టుబడిగానే నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement