LOADING...
Gold Price: పసిడి ధరలకు బ్రేక్‌.. ఉగాది నాడు ఎంత తగ్గిందంటే?
పసిడి ధరలకు బ్రేక్‌.. ఉగాది నాడు ఎంత తగ్గిందంటే?

Gold Price: పసిడి ధరలకు బ్రేక్‌.. ఉగాది నాడు ఎంత తగ్గిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా ఇరాన్‌-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో స్వచ్ఛమైన బంగారం ధర లక్షా 60 వేల మార్క్‌ను తాకగా ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినమైన మార్చి 19, 2026న గోల్డ్‌, సిల్వర్ ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. పలు వెబ్‌సైట్ల సమాచారం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన రేట్లు ఇలా ఉన్నాయి. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,57,740కు చేరింది.

Details

ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప మార్పులు

అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 తగ్గి రూ.1,44,590గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,64,900గా ఉంది. అయితే ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,57,740, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,590గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,57,740, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,590గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,890, 22 క్యారెట్ల ధర రూ.1,44,740గా ఉంది. వెండి కిలో ధర రూ.2,64,900గా నమోదైంది.

Details

ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,740

ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,57,740, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,590గా ఉంది. వెండి ధర రూ.2,64,900గా కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,58,940, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,690గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,74,900గా నమోదైంది. మొత్తంగా చూస్తే భారీ పెరుగుదల తర్వాత ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, ఇంకా అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి.

Advertisement