పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్
పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాబోయే ఆర్థిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు టీసీఎస్ ఫైలింగ్‌లో ఏదైనా జాప్యం జరిగితే భారత చట్టం ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించనున్నారు. ఫైనాల్స్ బిల్లులో తగిన సవరణలు తాము చేయోచ్చని, అయితే దీనిపై తాము త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
వృత్తిపరమైన రుసుము చెల్లింపులకు టీడీఎస్ వర్తింపు
చెల్లింపుదారునిపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్ర బడ్జెట్ ఇప్పటికే కొన్ని మార్పులను చేసింది. ప్రతి త్రైమాసికానికి టీడీఎస్ రిటర్న్ ను దాఖలు చేసే వరకు చెల్లింపులు చేయడానికి వీలు కల్పించింది. ఇక వృత్తిపరమైన రుసుము వంటి చెల్లింపులకు కూడా టీడీఎస్ వర్తించనుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276B ప్రకారం, ఒక వ్యక్తి విత్‌హెల్డ్ చేసిన పన్నును డిపాజిట్ చేయడంలో విఫలమైతే జరిమానాతో పాటు మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.