Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్పంగా పడిపోయినప్పటికీ చివరికి కొంత కోలుకుని స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,575.96 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,726.34 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 81,182.69 పాయింట్లకు తగ్గింది. చివరికి 1.59 పాయింట్ల స్వల్ప లాభంతో 81,510.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 8.95 పాయింట్లు తగ్గి 24,610.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 1,970 షేర్లు లాభపడగా, 1,828 షేర్లు నష్టపోయాయి, మరొక 122 షేర్లలో మార్పు లేదు.
పెరిగిన ఐటీ, మెటల్ షేర్లు..
సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ లూజర్స్‌గా నిలవగా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడినవి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున పెరగగా, పవర్, టెలికాం, మీడియా రంగాలు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు పతనమయ్యాయి. అయితే ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు 0.4-1 శాతం మధ్య లాభాలను సాధించాయి.