LOADING...
CNG Price Hike: మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం
సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం

CNG Price Hike: మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండగా తాజాగా సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 పెంచారు. కొత్త ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.83.09కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, సహజ వాయువు ధరలు పెరగడం వల్ల దేశీయంగా కూడా ఇంధన వ్యయాలు అధికమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువ

ఇటీవల రోజుల్లో సీఎన్‌జీ ధరలను వరుసగా రెండుసార్లు పెంచడం గమనార్హం. కేవలం 12రోజుల వ్యవధిలోనే కిలోకు మొత్తం రూ.6వరకు పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్,డీజిల్ తర్వాత ఇప్పుడు సీఎన్‌జీ కూడా ప్రజల జేబుకు భారంగా మారిందని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ ఆటోలు,టాక్సీలు,పాఠశాల వ్యాన్లు,వ్యక్తిగత కార్లు పెద్ద సంఖ్యలో సీఎన్‌జీపై ఆధారపడుతున్నాయి. తరచూ ధరలు పెరుగుతుండటంతో రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులతో జీవనం సాగించడం కష్టంగా మారిందని ఆటో,టాక్సీ సంఘాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రయాణ ఛార్జీలు,సరుకు రవాణా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement