LOADING...
Gold and Silver-Crude Oil: తగ్గిన బంగారం,వెండి ధరలు.. నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు
తగ్గిన బంగారం,వెండి ధరలు.. నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

Gold and Silver-Crude Oil: తగ్గిన బంగారం,వెండి ధరలు.. నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోవైపు బంగారం,వెండి ధరలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా డాలర్‌ బలపడటంతో పాటు బాండ్‌ రాబడులు పెరగడం వల్ల విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గి, ధరలు దిగజారుతున్నాయి. బుధవారం ఉదయం 9.30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు(31.10 గ్రాములు) బంగారం ధర సుమారు 70డాలర్లు తగ్గి 4,057 డాలర్ల వద్ద నమోదైంది. ఔన్సు వెండి ధర 60.95 డాలర్లుగా ఉంది. దీనికి అనుగుణంగా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.2,000 తగ్గి రూ.1,47,100కు చేరింది.

వివరాలు 

బంగారం, వెండిలో తగ్గుతున్న పెట్టుబడులు 

కిలో వెండి ధర సుమారు రూ.4,000 క్షీణించి రూ.2.29 లక్షల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో కూడా బంగారం, వెండి ధరలు సుమారు ఒక శాతం మేర తగ్గాయి. ఆగస్టు గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,759గా నమోదైంది. జులై వెండి ఫ్యూచర్స్‌లో కిలో ధర రూ.2.24 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు ఇవ్వడంతో డాలర్‌ ఇండెక్స్‌ తొలిసారిగా 100 మార్కును దాటింది. ఈ ప్రభావంతో బంగారం, వెండిలో పెట్టుబడులు తగ్గుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా?

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం భారీగా క్షీణించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుని 76.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూతీఐ) క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.69 డాలర్లకు పడిపోయింది. హర్మూజ్‌ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలు పునరుద్ధరించబడటం, అలాగే ఇరాన్‌ చమురుపై అమెరికా విధించిన ఆంక్షలకు కొన్ని మినహాయింపులు లభించడం వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా పెరిగింది. దీంతో ధరలు మరింత దిగివస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

వివరాలు 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా?

చమురు ధరలు మరింత తగ్గితే భారత్‌పై దిగుమతుల భారం కొంత తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల రూపాయి విలువ బలపడటంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గవచ్చు. అయితే ఈ ప్రభావం వెంటనే సామాన్య ప్రజలకు చేరే అవకాశాలు కనిపించడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో తగ్గుదల కనిపించాలంటే మరికొంత సమయం పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement