LOADING...
Swiggy executive: డెలివరీ ఉద్యోగాలను గిగ్ వర్క్‌గా కాకుండా సౌకర్యవంతమైన ఉపాధిగా చూడాలి: స్విగ్గీ ఎగ్జిక్యూటివ్
డెలివరీ ఉద్యోగాలను గిగ్ వర్క్‌గా కాకుండా సౌకర్యవంతమైన ఉపాధిగా చూడాలి

Swiggy executive: డెలివరీ ఉద్యోగాలను గిగ్ వర్క్‌గా కాకుండా సౌకర్యవంతమైన ఉపాధిగా చూడాలి: స్విగ్గీ ఎగ్జిక్యూటివ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్ డెలివరీ రంగంలో గిగ్ వర్క్ మోడల్పై చర్చలు ఎక్కువవుతున్న వేళ, డెలివరీ ఉద్యోగాలపై స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెలివరీ పార్ట్‌నర్లను కేవలం గిగ్ వర్కర్లుగానే చూడటం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ విభాగంలో వీరు మూడో ప్రధాన స్థంభంగా నిలుస్తున్నారని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సమావేశం సందర్భంగా ఆయన ఈ అంశంపై స్పందించారు.

వివరాలు 

జీవనోపాధి కోణంలో ఇవి అత్యంత కీలకం 

'గిగ్' అనే పదం వినడానికి ఆకర్షణీయంగా ఉన్నా,దీనిని ఒక ఫ్లెక్సిబుల్ ఉపాధి అవకాశంగా చూడాలని కపూర్ సూచించారు. ఉద్యోగ వ్యవస్థలో మూడు కీలక మార్గాలు ఉన్నాయని వివరించారు.మొదటిది ఫార్మల్ ఎంప్లాయ్‌మెంట్,ఇది దీర్ఘకాలిక స్థిర ఉద్యోగం. రెండోది ఔత్సాహిక వ్యాపారం,అంటే వ్యక్తి స్వంతంగా చిన్నదో పెద్దదో వ్యాపారం నిర్వహించే మార్గం. ఇక మూడోది డెలివరీ ఉద్యోగాల వంటి ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్ అని చెప్పారు. జీవనోపాధి కోణంలో ఇవి అత్యంత కీలకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఒక దశలో స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ద్వారానే సుమారు 25లక్షల మంది ఉపాధి పొందినట్లు కపూర్ వెల్లడించారు. ఈ సంఖ్యలు కేవలం స్విగ్గీకి సంబంధించినవేనని,మొత్తం ఫుడ్ డెలివరీ రంగంలో ఇంకా విస్తృత వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

డెలివరీ ఉద్యోగాలు అందరికీ ఒకే విధంగా ఉండవు 

ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి కూడా చేశారు. డెలివరీ ఉద్యోగాలను ఫార్మల్ ఎంప్లాయ్‌మెంట్‌తో సమానంగా చూడకూడదని అన్నారు. ఆ రంగానికి ఉన్న నియమాలు,నిబంధనలను ఇక్కడకు వర్తింపజేస్తే,ఈ ఉద్యోగాలకు ఉన్న ప్రత్యేకతను దెబ్బతీసినట్టే అవుతుందని స్పష్టం చేశారు. ఈ ఉపాధి స్వభావం ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. డెలివరీ ఉద్యోగాలు అందరికీ ఒకే విధంగా ఉండవని కపూర్ తెలిపారు. కొందరు దీన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తే, మరికొందరు కొద్ది నెలలపాటు మాత్రమే చేస్తారని చెప్పారు. విద్యార్థులు తమ ఖర్చుల కోసం, మరికొందరు అదనపు ఆదాయం కోసం ఈ అవకాశాన్ని ఎంచుకుంటారని వివరించారు. ఈ విధంగా ఫ్లెక్సిబుల్ ఉపాధి విభాగంలోకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని స్విగ్గీ సీఈఓ వెల్లడించారు.

Advertisement