Loading...
Walt Disney: వాల్ట్‌ డిస్నీలో వేల ఉద్యోగాల కోత.. 20 శాతం ఖర్చులు తగ్గించే యోచన!
వాల్ట్‌ డిస్నీలో వేల ఉద్యోగాల కోత.. 20 శాతం ఖర్చులు తగ్గించే యోచన!

Walt Disney: వాల్ట్‌ డిస్నీలో వేల ఉద్యోగాల కోత.. 20 శాతం ఖర్చులు తగ్గించే యోచన!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వినోద రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన వాల్ట్‌ డిస్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థలో దాదాపు 20 శాతం వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించిన డిస్నీ.. ఈ మేరకు కీలక మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపుతో పాటు ఇతర వ్యయ నియంత్రణ చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల కోత ప్రభావం ప్రధానంగా డిస్నీకి చెందిన థీమ్‌ పార్కులు, టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు, సినిమా నిర్మాణ విభాగాలపై పడే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపు ద్వారా ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి వ్యాపారాభివృద్ధికి వినియోగించాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది.

వివరాలు 

సూసేలోనూ 10 శాతం ఉద్యోగుల తొలగింపు

ముఖ్యంగా సినిమా, టెలివిజన్‌ కార్యక్రమాల నిర్మాణం, సాంకేతికత, థీమ్‌ పార్కులు, క్రూయిజ్‌ షిప్‌ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచాలని డిస్నీ సీఈవో జోష్‌ డిఅమారో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

మరోవైపు ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సూసే కూడా ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. సంస్థలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

ఈ విషయాన్ని కంపెనీ సీఈవో డిర్క్‌ పీటర్‌ వాన్‌ లీవెన్‌ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు.

కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ కారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పనిచేసే విధానంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సంస్థలు తమ కార్యకలాపాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.

ADVERTISEMENT