LOADING...
Economic Survey: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు
2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

Economic Survey: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తోంది. ఆ మార్పుల ప్రభావం 2008 ఆర్థికసంక్షోభం కంటే తీవ్రంగా ఉండవచ్చని 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ముఖ్యంగా, భారతదేశంలో ఐటీ ఆధారిత వైట్‌కాలర్ ఉద్యోగాలు ఏఐ కారణంగా ప్రత్యక్ష ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో అవకాశాలు 10 నుంచి 20 శాతానికి పరిమితం అవుతాయి, కానీ ప్రభావం చాలా తీవ్రమైనది అని సర్వే స్పష్టం చేసింది. సర్వే ప్రకారం,"భారత ఐటీ రంగం వైట్‌కాలర్ ఉద్యోగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.ఏఐ ప్రవేశంతో ఈ రంగంపై గణనీయమైన ప్రభావం ఉండవచ్చు.రాత్రి ఒక్క రాత్రే ఉద్యోగాలు రద్దవ్వవు, కానీ కొత్త ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.కొన్ని విభాగాల్లో ఏఐ ఇప్పటికే ఉద్యోగాలను భర్తీ చేస్తోంది."

వివరాలు 

ఉద్యోగాలను రక్షించడానికి ప్రత్యేక ఏఐ ఆర్థిక మండలి

విదేశీ కంపెనీలు భారత్‌ నుంచి తక్కువ వేతనంతో ఐటీ సేవలను పొందుతున్నాయి. ఇప్పుడు అదే ప్రమాదానికి గురవుతున్నాయి. ఎందుకంటే ఏఐ అవి వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహిస్తోంది. సర్వే ప్రతిపాదన ప్రకారం, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఉద్యోగాలను రక్షించడానికి ప్రత్యేక ఏఐ ఆర్థిక మండలి (AI Economic Council) ఏర్పాటు చేయడం అవసరం. అంతర్జాతీయ స్థాయిలో, భౌగోళిక రాజకీయ పోటీ పెరుగుతున్నది, ఐరోపా భద్రతా పరిస్థితులు సంక్లిష్టమవుతున్నాయి, వాణిజ్య విధానాల్లో రాజకీయ స్వార్ధం ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నది అని సర్వే హెచ్చరించింది. సాంకేతికతపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల పొంచి ఉన్న ఆర్థిక ముప్పు మళ్లీ పెరుగుతుంది.

వివరాలు 

ప్రమాదాలను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలు 

ఇక బంగారం ధరలు 2025లో ఒక ఔన్సుకు 2,607 డాలర్లు నుంచి 4,315 డాలర్లకు చేరడం, అలాగే డాలర్ బలహీనత, మదుపర్లలో ఆందోళనను పెంచుతున్నాయి. పలు సంస్థలు ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందనే ఆశతో భారీ పెట్టుబడులు చేస్తున్నాయి. అయితే, ఏదైనా సవరణలు చోటుచేసుకుంటే భారత్ వంటి మార్కెట్లలో పెట్టుబడులపై ప్రభావం పడవచ్చు. ఈ పరిస్థితుల మధ్య, భారత్‌కు ముప్పు ఉన్నప్పటికీ, ఆర్థిక పునాది, విస్తృత దేశీయ మార్కెట్, భారీ విదేశీ మారక నిల్వలు బఫర్‌గా పనిచేయగలవని సర్వే గుర్తించింది. పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించింది

Advertisement