LOADING...
EPFO: ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనలు అమల్లోకి.. పీఎఫ్ విత్‌డ్రాపై కీలక పరిమితులు
ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనలు అమల్లోకి.. పీఎఫ్ విత్‌డ్రాపై కీలక పరిమితులు

EPFO: ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనలు అమల్లోకి.. పీఎఫ్ విత్‌డ్రాపై కీలక పరిమితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. నేటి నుంచి పీఎఫ్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక భద్రత కోడ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్-1952, ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానంలో కొత్త పథకాలను అమలు చేస్తూ మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

వివరాలు 

పీఎఫ్ విత్‌డ్రాపై కొత్త పరిమితులు

కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకునే విధానాన్ని మరింత కఠినతరం చేశారు. గతంలో అవసరానికి అనుగుణంగా విత్‌డ్రా చేసే అవకాశం ఉండగా, ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అనారోగ్యం, విద్య, ఇల్లు కోసం వేర్వేరు నిబంధనలు అనారోగ్య అవసరాలు: ఇంతకుముందు వైద్య అవసరాల కోసం పీఎఫ్ నుంచి అవసరమైనన్ని సార్లు డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఏడాదిలో ఒకసారి పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత అనారోగ్య కారణంగా మరోసారి మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

విద్య కోసం:

చదువు అవసరాల కోసం మాత్రం మొత్తం మీద 10 సార్ల వరకు పీఎఫ్ నుంచి డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం కొనసాగుతుంది. ఇల్లు, స్థలం, అద్దె కోసం: ఇల్లు కొనుగోలు, స్థలం కొనుగోలు లేదా ఇంటి అద్దె చెల్లింపుల కోసం గతంలో రెండు సార్లు మాత్రమే పీఎఫ్ విత్‌డ్రాకు అనుమతి ఉండేది. కొత్త నిబంధనలతో ఈ పరిమితిని ఐదు సార్లకు పెంచారు. ఖాతాలో తప్పనిసరిగా 25 శాతం నిల్వ కొత్త విధానం ప్రకారం పీఎఫ్ ఖాతాలో కనీసం 25శాతం మొత్తం తప్పనిసరిగా ఉంచాల్సి ఉంటుంది. దీంతో ఖాతాలోని మొత్తం డబ్బును ఒకేసారి ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. ఈ 25 శాతం లెక్కింపులో ఉద్యోగి వాటా,యజమాని వాటా,వాటిపై జమ అయిన వడ్డీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

వివరాలు 

కంపెనీలు, సంస్థలకు కూడా కొత్త నిబంధనలు

అలాగే పీఎఫ్ ఖాతా ప్రారంభమైన తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రాకు అర్హత ఉంటుంది. సంస్థలపై కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలు విధించింది. ఇకపై 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యం కల్పించడం తప్పనిసరి. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో యజమాని తప్పనిసరిగా 12 శాతం వాటాను జమ చేయాలి. ఈ మొత్తాన్ని ఉద్యోగి జీతం నుంచి మినహాయించడానికి అనుమతి ఉండదు. ఒకవేళ యజమాని తన వాటాను ఉద్యోగి వేతనం నుంచి కోత విధించినట్లు తేలితే సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement