Page Loader
FMCGs: ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు
ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు

FMCGs: ఓఆర్‌ఎస్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఎంసీజీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) విపణిలో ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయి. రూ.1,000 కోట్లకు పైగా విలువగల ఈ రంగంలో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌), హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) వంటి ప్రముఖ కంపెనీలు సవాల్‌కు సిద్ధమవుతున్నాయి. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్‌సీపీఎల్‌ తాజాగా 'రస్కిక్‌ గ్లూకో ఎనర్జీ' పేరుతో ఓసారి వినియోగించేందుకు ఉద్దేశించిన ఓఆర్‌ఎస్‌ పానీయాన్ని రూ.10 ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో యునిలీవర్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో 'లిక్విడ్‌ ఐవీ' అనే పేరుతో ఓఆర్‌ఎస్‌ ఉత్పత్తిని విపణిలో ప్రవేశపెట్టింది.

Details

ఓఆర్‌ఎస్‌ఎల్‌ ప్రస్తుతం 61.3 శాతం మార్కెట్‌ వాటా

ఇప్పటికే ఈ విభాగంలో ఆరోగ్య సంరక్షణ సంస్థలు విశేషంగా వ్యవహరిస్తున్నాయి. సిప్లా కంపెనీ 'ప్రోలైట్‌' టెట్రా ప్యాక్‌ ఫార్మాట్‌లో ఓఆర్‌ఎస్‌ను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డజనుకు పైగా రకాలుగా అందిస్తోంది. గత మూడేళ్లలో ఈ కంపెనీ తన వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేసింది. 2022 నుంచి ఇది మార్కెట్‌ వాటాను 600 బేసిస్‌ పాయింట్లు (అంటే 6 శాతం) పెంచుకొని, ప్రస్తుతం 14 శాతం వాటాను కలిగి ఉంది. ఓఆర్‌ఎస్‌ విభాగంలో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న ఓఆర్‌ఎస్‌ఎల్‌ ప్రస్తుతం 61.3 శాతం మార్కెట్‌ వాటాతో ముందంజలో ఉంది. అయితే గత మూడేళ్లలో దీని మార్కెట్‌ వాటా 740 బేసిస్‌ పాయింట్లు (7.4 శాతం) తగ్గిన విషయం గమనార్హం.

Details

ఇతర పానీయాల కంటే కంటే మంచింది

ఈ నేపథ్యంలో, సిప్లా హెల్త్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ శివమ్‌ పురి మాట్లాడుతూ, "భారతీయ వినియోగదారులు ఆరోగ్య పరిరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఓఆర్‌ఎస్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఇది ఇతర పానీయాల కంటే హైడ్రేషన్‌ పరంగా అత్యుత్తమమైనదిగా నిలుస్తోందని తెలిపారు. వేసవి కాలంలో గ్లూకోజ్‌ ఆధారిత ఓఆర్‌ఎస్‌ థెరపీగా విస్తృతంగా వాడుతున్నాయి. డయేరియాతో కలిగే డీహైడ్రేషన్‌ను నివారించేందుకు యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్ (యునిసెఫ్‌) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లు ఓఆర్‌ఎస్‌ వినియోగాన్ని సిఫార్సు చేస్తున్నాయి. ఇక స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ విభాగంతో పాటు లైఫ్‌స్టైల్‌ రంగంలో కూడా ఈ ఉత్పత్తికి ఆదరణ పెరుగుతోంది.

Details

ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం

హెచ్‌యూఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (బ్యూటీ అండ్‌ వెల్‌బీయింగ్‌) హర్మన్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ, "ఆరోగ్యంగా ఉండటం, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఇది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు వారి రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. లిక్విడ్‌ ఐవీ 18-45 ఏళ్ల వయసు గల ప్రయాణాలు చేసే వారు, క్రియాశీల జీవనం గల వారు మరియు క్రీడాపటువులకు ప్రత్యేకంగా రూపొందించారని అన్నారు. ఆర్‌సీపీఎల్‌ సీఓఓ కేతన్‌ మోదీ మాట్లాడుతూ మన తల్లులు చిన్నతనంలో ఇచ్చే సంప్రదాయ రీహైడ్రేషన్‌ పానీయంలా రస్కిక్‌ గ్లూకో ఎనర్జీ ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి తగినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది. రెడీ-టు-డ్రింక్‌ ఫార్మాట్‌లో ఇది భారతీయ వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా తయారైందని వివరించారు.