Foxconn: భారత్‌లో 1.6 బిలియన్ డాలర్లు పెట్టుబడికి 'ఫాక్స్‌కాన్ రెడీ
Foxconn Investment in India: ఆపిల్ ఐఫోన్(iPhone)ను తయారుదారు, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) తన కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారతదేశంలో 1.6 బిలియన్ డాలర్ల( రూ.13,000కోట్లు)ను పెట్టుబడి పెట్టబోతోంది. ఈ సమాచారాన్ని తైవాన్‌లో ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఫాక్స్‌కాన్ ఈ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే కంపెనీ కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ఈ పెట్టుబడిని పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఫాక్స్‌కాన్‌ను 'హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో' అని కూడా పిలుస్తారు. చైనా- అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హాన్ హై'తో పాటు ఇతర తైవానీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు చైనా వెలుపల పెట్టుబడులను పెంచాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే భారత్‌లో పెట్టుబడి పెట్టాలని Foxcon భావిస్తోంది.
కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందా?
కొత్త పెట్టుబడుల్లో భాగంగా కంపెనీ భారత్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందా? లేదా పాత సదుపాయంలోనే పెట్టుబడి పెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఫాక్స్‌కాన్‌కు వచ్చే ఆదాయంలో సగానికిపైగా యాపిల్ నుంచే వస్తోంది. Apple iPhone కాకుండా, కంపెనీ గత చాలా సంవత్సరాలుగా భారతదేశంలో ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఆపిల్ తాజా ఐఫోన్ 15 ను భారతదేశంలో ఫాక్స్‌కాన్ తయారు చేసింది. ఫాక్స్‌కాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్‌లో కంపెనీ పరిమాణాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు ధృవీకరించారు. ఫాక్స్‌కాన్‌కు తొమ్మిది ప్రొడక్షన్ క్యాంపస్‌లలో 30 కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో 10,000 కంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు. దీని ద్వారా కంపెనీ ఏటా 10 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది.