Loading...
Gold Rates Today: బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. అక్టోబర్ 7న నగరాల వారీగా ధరలివే..
బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. అక్టోబర్ 7న నగరాల వారీగా ధరలివే..

Gold Rates Today: బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. అక్టోబర్ 7న నగరాల వారీగా ధరలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లైంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై నెలకొన్న ఆందోళనలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పులు చేసిన తర్వాత పసిడి ధరల్లో అనూహ్య హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం రేట్లు ప్రస్తుతం ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7, బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

వివరాలు 

నేడు బంగారం ధరలు ఎంతంటే?

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర రూ.1,50,230గా కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,37,710గా ఉంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,37,710 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,010గా నమోదైంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,37,710గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,230గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,710 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,380గా ఉంది.22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,37,560 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

వెండి ధరలు దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ రేట్లు కొద్దిగా దిగిరావడంతో దేశీయంగా కూడా అదే ప్రభావం కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,34,900గా ఉంది. మంగళవారం కిలో వెండి రూ.2.35 లక్షల వద్ద ఉంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదైంది. మంగళవారం ఇదే వెండి ధర రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది.

చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900గా ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా కొనసాగింది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,34,900గా నమోదైంది. మంగళవారం కిలో వెండి రూ.2.35 లక్షల వద్ద స్థిరపడింది.

ADVERTISEMENT

వివరాలు 

గమనిక:

బంగారం,వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంటుంది.

పై ధరల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటి అదనపు వ్యయాలు కలిగి ఉండకపోవచ్చు. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానికంగా తాజా రేట్లను నిర్ధారించుకోవడం మంచిది.

ADVERTISEMENT