Gold Price Today: బంగారం ధరలు భారీగా పతనం.. తులంపై రూ.4,500 తగ్గుదల!
ఈ వార్తాకథనం ఏంటి
బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమైన ధరల తగ్గుదల తర్వాత సెప్టెంబర్ ప్రారంభంలో పసిడి, వెండి రేట్లు కొంత పుంజుకున్నాయి. అయితే నెలాఖరుకు వచ్చేసరికి రెండు విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఒక్కరోజే రూ.2,500కుపైగా తగ్గుదల నమోదైంది. ఈ వారంలో మొత్తంగా చూస్తే తులం పసిడి ధర దాదాపు రూ.4,500 వరకు తగ్గింది. సెప్టెంబర్ 29న తులం బంగారం ధర రూ.1,50,160గా కొనసాగుతోంది. ఈ నెలలో నమోదైన ధరలతో పోలిస్తే ఇది అత్యల్ప స్థాయి.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ అస్థిరత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన చిన్న వ్యాపారులపై కూడా ప్రభావం చూపుతోంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది. ఒక్కరోజులోనే కిలో వెండి ధర సుమారు రూ.5,000 వరకు పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640గా ఉంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,310గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,790 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,640గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,640 వద్ద ట్రేడవుతోంది.