Loading...
Gold Rate Today: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం,వెండి.. నేటి ధరలు ఇవే..
ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం,వెండి.. నేటి ధరలు ఇవే..

Gold Rate Today: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం,వెండి.. నేటి ధరలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలింది.దేశీయ మార్కెట్లో పసిడి,వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు,పెట్టుబడిదారుల కొనుగోలు, అమ్మకాల ధోరణుల ప్రభావంతో ఈ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం నాటికి ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లోనూ బంగారం,వెండి ధరలు పైకి కదిలాయి. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టుకు సంబంధించిన 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,362 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.837పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. MCX డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,85,634కు చేరింది.గత ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,058పెరిగింది.

వివరాలు 

హైదరాబాద్‌లోనూ పెరిగిన ధరలు

ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.

బుధవారం ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,860కు చేరింది.

గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.670 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,30,038గా నమోదైంది.

వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,86,210 వద్ద కొనసాగుతోంది.

గత ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,120 పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ADVERTISEMENT