Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా తాజా రేట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. భారతీయుల సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉండటంతో ధరల్లో మార్పులను కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తుంటారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, జూలై 7న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,710 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,540గా నమోదైంది.
వివరాలు
ప్రధాన నగరాలలో బంగారం ధర
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390గా ఉంది. ఇదే ధరలు బెంగళూరులో కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,920 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,590గా కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390గా నమోదైంది.
వివరాలు
వెండి ధరలు
వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదైంది.
వివరాలు
బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న అంచనాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ బలపడటంతో ఇటీవల బంగారం ధరలపై ఒత్తిడి ఏర్పడి తగ్గుదల కనిపిస్తోంది. అయితే అమెరికా ఉద్యోగ మార్కెట్ ఆశించిన స్థాయిలో సానుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం లేదా తగ్గించే అవకాశాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరలకు మద్దతుగా మారి, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశాన్ని బలపరుస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.