LOADING...
Gold and Silver: భారీ ఊరటనిచ్చిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
భారీ ఊరటనిచ్చిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold and Silver: భారీ ఊరటనిచ్చిన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సమయంలో బంగారం,వెండి ధరలు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి. ఈరోజు బంగారం ధర కొద్దిగా పెరిగినప్పటికీ, వెండి ధర స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది మంచి వార్తగా మారింది. ఈరోజు తులం బంగారం ధర రూ.110 పెరిగింది, అయితే వెండి ధరలో మార్పు లేదు. తాజా లావాదేవీల ప్రకారం, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,890 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

స్థిరంగా వెండి ధర

అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,48,400కు చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80 పెరుగుదలతో రూ.1,21,420 వద్ద కొనసాగుతోంది. వెండి ధర విషయానికి వస్తే, ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద విక్రయించబడుతోంది. హైదరాబాద్,చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement