LOADING...
Gold-Silver Rates: మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన వెండి,బంగారం ధరలు
మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన వెండి,బంగారం ధరలు

Gold-Silver Rates: మహిళలకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన వెండి,బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమ్మయ్య! బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. నిన్నమొన్నటివరకు రాకెట్‌లా దూసుకెళ్తున్న ధరలు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నాయి. నిన్నటి ఒరవడి ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు తులం గోల్డ్ ధరలో రూ.2,070 లు తగ్గించడంతో, కిలో వెండి ధరలో ఏకకాలంలో రూ.25,000 లు తగ్గింది. దీని వల్ల కొనుగోలుదారులకు ఊరట లభించింది.

వివరాలు 

భారీగా తగ్గిన వెండి ధరలు 

తులం గోల్డ్ రేటు తగ్గించడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఇప్పుడు రూ.1,52,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.1,900 తగ్గించబడి, రూ.1,39,650 వద్ద అమ్ముడవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,560 తగ్గి,రూ.1,14,260 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా భారీ ఉపశమనం ఇచ్చాయి.కిలో వెండిపై ఏకంగా రూ.25,000 లు తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్,చెన్నై మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ఉంది. ఢిల్లీ,ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కూడా కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement