Loading...
Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త దిగివచ్చాయి. ప్రపంచ ముడి చమురు ధరల్లో పెరుగుదల, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి పరిణామాల నేపథ్యంలో బంగారం మార్కెట్‌లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. జూలై 27 ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,840గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840గా కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,990గా ఉంది.

వివరాలు 

వెండి ధర

బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840గా కొనసాగుతోంది.

వెండి ధర విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది.

అయితే, ఇవి జూలై 27 ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు మాత్రమే.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్-సరఫరా, కరెన్సీ మార్పిడి విలువలు, స్థానిక పన్నులు తదితర అంశాల ప్రభావంతో రోజులో ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

గమనిక 

అలాగే బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక మార్కెట్ పరిస్థితులు, రాష్ట్రాల వారీగా అమలులో ఉన్న పన్నులు, ఇతర వ్యాపార అంశాల కారణంగా నగరానికొక విధంగా ధరల్లో తేడాలు కనిపిస్తాయి.

బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్లు తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT