Loading...
Gold & Silver Rates: పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold & Silver Rates: పెరిగిన పసిడి.. తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారంపై డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో బంగారంతో పాటు వెండి కూడా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగారం మళ్లీ బలపడుతున్నప్పటికీ, వెండి మాత్రం పెట్టుబడిదారులను నిరుత్సాహపరుస్తోంది. బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం కొంత తగ్గింది. ఈ రోజు (ఫిబ్రవరి 11) ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,790గా నమోదైంది.

వివరాలు 

వెండి స్వల్ప పతనం

అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,45,560గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,940కి చేరుకోగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,45,710గా నమోదైంది.

ఇక వెండి విషయానికి వస్తే, ధరలో స్వల్ప పతనం కనిపించింది.

బుధవారం కిలో వెండిపై సుమారు రూ.100 మేర తగ్గుదల చోటుచేసుకుంది.

దీంతో వెండి ధర మళ్లీ రూ.3 లక్షల స్థాయికి దిగువకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ.1,58,790, రూ.1,45,560

విజయవాడలో రూ.1,58,790, రూ.1,45,560

ఢిల్లీలో రూ.1,58,940, రూ.1,45,710

ముంబైలో రూ.1,58,790, రూ.1,45,560

వడోదరలో రూ.1,58,840, రూ.1,45,610

కోల్‌కతాలో రూ.1,58,790, రూ.1,45,560

చెన్నైలో రూ.1,58,790, రూ.1,45,560

బెంగళూరులో రూ.1,58,790, రూ.1,45,560

కేరళలో రూ.1,58,790, రూ.1,45,560

పుణెలో రూ.1,58,790, రూ.1,45,560

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ.2,99,900

విజయవాడలో రూ.2,99,900

ఢిల్లీలో రూ.2,89,900

చెన్నైలో రూ.2,99,900

కోల్‌కతాలో రూ.2,89,900

కేరళలో రూ.2,99,900

ముంబైలో రూ.2,89,900

బెంగళూరులో రూ.2,89,900

వడోదరలో రూ.2,89,900

అహ్మదాబాద్‌లో రూ.2,89,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT