Gold & Silver Rates:స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి .. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు గత రెండు-మూడు రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయికి చేరిన వెంటనే వేగంగా తగ్గిన ఈ లోహాలు,ప్రస్తుతం పెట్టుబడిదారుల అప్రమత్త వైఖరి కారణంగా స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ రోజు (ఫిబ్రవరి 9) ఉదయం 6:30 గంటల సమయానికి 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,540 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,740కు చేరగా,22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,690గా నమోదైంది.
వివరాలు
కిలో వెండి ధర రూ.3 లక్షల కంటే తక్కువ
ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా భారీగా పడిపోయిన వెండి ధర కూడా ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.
కిలో వెండి ధర రూ.3 లక్షల కంటే తక్కువగానే ఉంది.
సోమవారం ఒక్కరోజే కిలోపై సుమారు వంద రూపాయల మేర తగ్గుదల చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1,56,590, రూ. 1,43,540
విజయవాడలో రూ. 1,56,590, రూ. 1,43,540
ఢిల్లీలో రూ. 1,56,740, రూ. 1,43,690
ముంబైలో రూ. 1,56,590, రూ. 1,43,540
వడోదరలో రూ. 1,56,640, రూ. 1,43,590
కోల్‌కతాలో రూ. 1,56,590, రూ. 1,43,540
చెన్నైలో రూ. 1,56,590, రూ. 1,43,540
బెంగళూరులో రూ. 1,56,590, రూ. 1,43,540
కేరళలో రూ. 1,56,590, రూ. 1,43,540
పుణెలో రూ. 1,56,590, రూ. 1,43,540
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2,84,900
విజయవాడలో రూ. 2,84,900
ఢిల్లీలో రూ. 2,84,900
చెన్నైలో రూ. 2,84,900
కోల్‌కతాలో రూ. 2,84,900
కేరళలో రూ. 2,84,900
ముంబైలో రూ. 2,84,900
బెంగళూరులో రూ. 2,84,900
వడోదరలో రూ. 2,84,900
అహ్మదాబాద్‌లో రూ. 2,84,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.