Gold Rate: దిగొచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లు పెరిగే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు దిగొస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా నమోదైంది. గత రోజుతో పోలిస్తే పసిడి ధర సుమారు రూ.1,400 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,86,550కు చేరింది. బుధవారంతో పోలిస్తే కిలో వెండిపై రూ.3,000కుపైగా తగ్గుదల నమోదైంది.
వివరాలు
ధరల తగ్గుదలకు కారణాలివే..
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,974 డాలర్లుగా ఉండగా.. ఔన్సు వెండి ధర 51.48 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర ఈ స్థాయికి పడిపోవడం నవంబరు 4 తర్వాత ఇదే తొలిసారి.
మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో డిసెంబరు డెలివరీకి సంబంధించిన 10 గ్రాముల బంగారం ధర రూ.1.38 లక్షలకు దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.1.82 లక్షలకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ 19 నెలల గరిష్ఠ స్థాయికి చేరడం కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు లోహాల కొనుగోళ్లు, అమ్మకాలు ప్రధానంగా డాలర్లలోనే జరుగుతాయి.
వివరాలు
ధరల తగ్గుదలకు కారణాలివే..
డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం, వెండి కొనుగోలు చేయడం ఖరీదుగా మారుతుంది.
దీంతో అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.
దీనికితోడు వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు కూడా పసిడి, వెండి ధరల పతనానికి మరో కారణంగా మారుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు బంగారం, వెండి నుంచి తమ పెట్టుబడులను వెనక్కి మళ్లిస్తున్నారు. దాని ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ కనిపిస్తోంది.