LOADING...
Gold And Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి బంపర్ ఆఫర్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు
భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold And Silver Price: పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి బంపర్ ఆఫర్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతున్న వేళ, మూఢం కూడా ముగియడంతో ఇప్పుడు అన్ని రోజులు శుభకరంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం పసిడి ప్రియులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం, వెండి రేట్లు గణనీయంగా పడిపోవడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం. గత రెండు వారాలుగా బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తుండగా, ఫిబ్రవరి 18 బుధవారం నాటికి పసిడి ధరలు మరింత దిగివచ్చాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,190గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,340కు తగ్గింది.

వివరాలు 

నగరాల వారీగా బంగారం ధరలు 

నగరాల వారీగా చూస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,210గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,190గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,190కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,340కు లభిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.1,54,340గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,490గా ఉంది. కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,340గా కొనసాగుతోంది.

వివరాలు 

గ్రాము వెండి ధర రూ.279.90

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా మాత్రమేనని, మార్కెట్‌ పరిస్థితుల్ని బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చని సూచిస్తున్నారు. ఇక వెండి విషయానికి వస్తే, ఈ రోజు గ్రాము వెండి ధర రూ.279.90కు చేరింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,79,900లుగా ఉంది. బంగారం, వెండి ధరలపై తాజా అప్‌డేట్స్‌ కావాలనుకునే వారు 8955664433 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వవచ్చని తెలియజేస్తున్నారు.

Advertisement