Loading...
Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే?
బంగారం,వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే?

Gold Price Today: బంగారం,వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం,వెండి ధరలు సోమవారం కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు,డాలర్-రూపాయి మారకపు విలువల్లో మార్పులు వంటి అంశాల ప్రభావంతోనే ఈ పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460కు చేరుకుంది. ఆదివారం ఇది రూ.1,43,290గా ఉండగా, ఒక్క రోజులోనే రూ.170 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,500గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.150 అధికం. మరోవైపు వెండి కిలో ధర రూ.2,34,900గా ఉంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,500. వెండి కిలో రూ.2,34,900.

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,500. వెండి కిలో రూ.2,34,900.

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,610, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,650. వెండి కిలో రూ.2,35,000.

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,500. వెండి కిలో రూ.2,34,900.

చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,500.వెండి కిలో రూ.2,34,900.

వివరాలు 

బంగారం కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది

బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,460, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,500. వెండి కిలో రూ.2,35,000.

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్-రూపాయి మారకపు విలువ, స్థానిక డిమాండ్-సరఫరా, రాష్ట్రాల వారీగా అమలయ్యే పన్నులు వంటి అనేక అంశాల ఆధారంగా వీటి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

తాజా బంగారం ధరలను తెలుసుకోవడానికి అధికారిక వేదికలను పరిశీలించవచ్చు. అలాగే 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ప్రస్తుత ధరల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT