Gold Price Today: బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల వారీగా లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల క్రితం వరకు రికార్డు స్థాయిలో పెరిగి సామాన్యులకు భారంగా మారిన బంగారం ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం,వెండి ధరలు స్వల్పంగా దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు,గ్లోబల్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతుండటం తెలిసిందే. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం,వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రభావం కొంత తగ్గడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు, మంగళవారం కూడా స్వల్పంగా తగ్గాయి.
వివరాలు
దేశీయ మార్కెట్‌లో నేటి ధరలు
బుధవారం (జూలై 15) ఉదయం 6 గంటల వరకు వివిధ బులియన్ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ.10 తగ్గి రూ.1,42,790
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ.10 తగ్గి రూ.1,30,890
వెండి (కిలో) - రూ.2,34,900
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,790 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,30,890 వెండి (కిలో): రూ.2,34,900
విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,790 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,30,890 వెండి (కిలో): రూ.2,34,900
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,940 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,040 వెండి (కిలో): రూ.2,34,900
ముంబై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,790 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,30,890 వెండి (కిలో): రూ.2,34,900
చెన్నై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు):రూ.1,43,450 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,490 వెండి (కిలో): రూ.2,34,900
వివరాలు
నగరాల వారీగా ధరలు ఎందుకు మారుతాయి?
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,790 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,30,890 వెండి (కిలో): రూ.2,34,900
బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, సరఫరా పరిస్థితులు, రవాణా వ్యయాలు, రాష్ట్రాల వారీ పన్నులు, ఇతర మార్కెట్ అంశాల ప్రభావంతో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తుంటాయి.
అందువల్ల కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలోని తాజా రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది.
అలాగే బంగారం, వెండి ధరల తాజా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా తాజా ధరలను తెలుసుకోవచ్చు.