LOADING...
Gold, Silver Prices: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

Gold, Silver Prices: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి మారకపు విలువల్లో మార్పులు కారణంగా బంగారం,వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం కొనుగోళ్లపై మోదీ చేసిన వ్యాఖ్యల అనంతరం మరుసటి రోజే బంగారం షేర్లు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో బంగారం ధరలపై కూడా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి.

వివరాలు 

వెండి ధరలు 

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120గా నమోదైంది. నిన్న ఈ ధర రూ.1,52,234గా ఉండేది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,39,440గా ఉండగా, నిన్న ఇది రూ.1,39,640గా నమోదైంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,800 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. 

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,39,440 గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది.

Advertisement

వివరాలు 

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,440 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,810,గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,990గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,270, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ1,39,590 వద్ద కొనసాగుతుంది.ఇక వెండి వెండి ధరలు చూసుకుంటే దేశీ మార్కెట్‌లో కేజీ వెడి ధర రూ.రూ.2,74,800 గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,85,100 గా ఉంది

Advertisement