LOADING...
Gold and Silver: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం బంగారం ధరలపై గట్టిగా కనిపిస్తోంది. ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు చమురు ధరలతో పాటు బంగారం ధరలపై కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యుద్ధం మొదలుకాకముందు సుమారు రూ.1.90 లక్షల వద్ద ట్రేడ్ అయిన 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర ఇప్పుడు రూ.1.48 లక్షల వరకు పడిపోయింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు రోజుకోలా తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటం కూడా ఈ ధరల తగ్గుదలకు మరో ముఖ్య కారణంగా మారింది.

వివరాలు 

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు..

హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం గురువారం 24 క్యారెట్ బంగారం ధర రూ.1,48,970 వద్ద నిలిచింది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం రూ.1,36,550 వద్ద, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇవాళ (శుక్రవారం ఉదయం) మూడు రకాల బంగారంపై ఒక్కో 10 రూపాయల చొప్పున ధరలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం ధర రూ.1,48,960కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.1,36,540గా, 18 క్యారెట్ ధర రూ.1,11,720గా నమోదయ్యాయి.

వివరాలు 

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

హైదరాబాద్: 1,48,960 విజయవాడ: 1,48,960 విశాఖపట్నం: 1,48,960 ముంబై: 1,48,960 బెంగళూరు: 1,48,960 ఢిల్లీ: 1,49,110 చెన్నై: 1,49,990 సూరత్: 1,49,010 గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Advertisement