Loading...
Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. నేటి తాజా రేట్లు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold Prices: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. నేటి తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కీలక సమాచారం. మంగళవారం పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు కొంత మేర దిగివచ్చాయి. తాజా మార్కెట్ ధరల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,670గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,190 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా కొద్దిగా తగ్గింది. కిలో వెండిపై సుమారు రూ.100 తగ్గడంతో ధర రూ.2,39,900కు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,12,250గా నమోదైంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకేలా ఉన్న ధరలు

తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో కూడా బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.

అయితే వడోదరలో బంగారం ధరలు కొంత ఎక్కువగా నమోదయ్యాయి. చెన్నైలో మాత్రం 18 క్యారెట్ల బంగారం ధరలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ఇతర పరిస్థితులకు అనుగుణంగా రోజంతా మారే అవకాశం ఉంటుంది.

అందువల్ల ఆభరణాలు లేదా వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించేవారు కొనుగోలుకు ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT