Loading...
Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!
మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో బంగారం ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పడిపోతున్న పసిడి ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,270గా నమోదైంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,740గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర శుక్రవారం రూ.2,59,900గా ఉండగా, నిన్నటితో పోలిస్తే కేవలం రూ.100 మాత్రమే తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరింత ఊగిసలాట ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Details

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు - 24K / 22K)

చెన్నై: రూ.1,51,630 / రూ.1,38,990

ముంబై: రూ.1,50,270 / రూ.1,37,740

న్యూఢిల్లీ: రూ.1,50,420 / రూ.1,37,890

కోల్‌కతా: రూ.1,50,270 / రూ.1,37,740

బెంగళూరు: రూ.1,50,270 / రూ.1,37,740

హైదరాబాద్: రూ.1,50,270 / రూ.1,37,740

విజయవాడ: రూ.1,50,270 / రూ.1,37,740

కేరళ: రూ.1,50,270 / రూ.1,37,740

పుణె: రూ.1,50,270 / రూ.1,37,740

వడోదరా: రూ.1,50,320 / రూ.1,37,790

అహ్మదాబాద్: రూ.1,50,320 / రూ.1,37,790

Details

వెండి ధరలు (కిలో)

చెన్నై: రూ.2,64,900

ముంబై: రూ.2,59,900

న్యూఢిల్లీ: రూ.2,59,900

కోల్‌కతా: రూ.2,59,900

బెంగళూరు: రూ.2,59,900

హైదరాబాద్: రూ.2,64,900

విజయవాడ: రూ.2,64,900

కేరళ: రూ.2,64,900

పుణె: రూ.2,59,900

వడోదరా: రూ.2,59,900

అహ్మదాబాద్: రూ.2,59,900

మొత్తంగా చూస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినా, రాబోయే రోజుల్లో ఇవి మారుతూ ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT