LOADING...
Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు!
బంగారం ధరలు మళ్లీ పతనం.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు!

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త అందింది. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా నాలుగో రోజు పడిపోవడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో ధరలు తగ్గడం మహిళలకు శుభవార్తగా మారింది. ఇటీవలి వరకు అధిక ధరల కారణంగా కొనుగోలుకు వెనుకడుగు వేసిన వారు, ఇప్పుడు రేట్లు తగ్గడంతో బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం దుకాణాల వద్ద కస్టమర్ల రద్దీ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు తగ్గడం, కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఇక ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Details

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,970

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,970గా ఉంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.2,940 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,33,800 వద్ద ట్రేడవుతుండగా, రూ.2,750 పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,48,580గా ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ.1,36,200గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,970గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,33,800గా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,120 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,33,950గా ఉంది.

Details

వెండి ధరల విషయానికి వస్తే

దిల్లీలో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ఉంది. ఒక్కరోజులోనే రూ.10,000 తగ్గింది. * హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా, వరుసగా పడిపోతున్న ధరలతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు.

Advertisement