LOADING...
Gold &Silver Rates: మళ్లీ పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22K, 24K తాజా రేట్లు ఇవే!
మళ్లీ పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22K, 24K తాజా రేట్లు ఇవే!

Gold &Silver Rates: మళ్లీ పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22K, 24K తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు ఈరోజు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా గోల్డ్ రేట్లు పడిపోతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,700 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,940 వరకు తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో కిలో వెండి ధరపై కూడా భారీగా రూ.10,000 తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,865గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,035 వద్ద ట్రేడవుతోంది. అదే 10 గ్రాముల పరంగా చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా కొనసాగుతోంది.

వివరాలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,800

ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,500కు చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. అయితే ఢిల్లీలో మాత్రం వెండి ధర కిలోకు రూ.5,000 పెరిగి రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా చూస్తే, బంగారం, వెండి ధరల్లో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది.

Advertisement