Gold Prices: మరింత తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఊరట.. తాజా ధరలు ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల రూ.1,50,000 మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తాజాగా మరింత తగ్గింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి కొంత ఉపశమనం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,36,740గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,220గా ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,36,890గా ఉంది.
వివరాలు
వెండి ధరలు
ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలోకు రూ.100 మేర తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,54,900గా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉండగా, బెంగళూరులో రూ.2,54,900గా ఉంది. గమనిక: బంగారం, వెండి ధరలు తరచూ మారుతుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి తప్పక పరిశీలించడం మంచిది.