LOADING...
Gold and Silver Rates: అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold and Silver Rates: అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బుధవారం కూడా అదే ధోరణిని కొనసాగించాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈ రోజు (మార్చి 11) ఉదయం సుమారు 10:15 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,310కు చేరుకుంది. ఇది నిన్నటి ధరతో పోల్చితే సుమారు రూ.930 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,700 వద్ద ఉంది. నిన్నటి ధరతో పోల్చితే దాదాపు రూ.850 పెరుగుదల నమోదైంది.

vivaralu

వెండి ధరలు

ఇక వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.90 లక్షలుగా ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది. గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి చెక్ చేసుకోవడం మంచిదని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

Advertisement