Loading...
Gold Prices Today: పండుగల వేళ బంగారం కొనేవారికి ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. నేటి ధరలు ఇవే..
పండుగల వేళ బంగారం కొనేవారికి ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. నేటి ధరలు ఇవే..

Gold Prices Today: పండుగల వేళ బంగారం కొనేవారికి ఊరట.. ఒక్కసారిగా ధరలు డౌన్.. నేటి ధరలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా దిగివస్తున్న పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గాయి. ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరల్లో పతనం కనిపిస్తోంది. పండుగల సీజన్‌లో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారం,వెండి కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చే పరిణామంగా చెప్పవచ్చు. మరి అక్టోబర్ 16, 2026న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివరాలు 

నేటి బంగారం ధరలు ఇవే..

దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,47,430గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,140 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,140గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,580గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,290 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా ఉంది.

వివరాలు 

సిల్వర్ రేట్లు ఇవే..

బెంగళూరులోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,140గా ఉంది.

వెండి ధరలు కూడా కొనుగోలుదారులు గమనించాల్సిన స్థాయిలో ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,39,900గా కొనసాగుతోంది. గత రోజు ఈ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,29,900గా ఉంది. గత రోజు వెండి ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగింది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,29,900గా నమోదైంది.

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంటాయి. నగల దుకాణాల్లో పన్నులు, తరుగు, తయారీ ఛార్జీల కారణంగా తుది ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ADVERTISEMENT