Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు ఊరట.. సెప్టెంబర్ 15న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఏవైనా బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో భాగంగా మారింది. మన సంస్కృతి, ఆచారాలతో పసిడికి ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా బంగారం ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తోంది. ప్రస్తుతం బంగారంతోపాటు వెండికీ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసే వారితోపాటు వ్యాపారులు, పెట్టుబడిదారులు సైతం రోజువారీ ధరలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
సోమవారంతో పోలిస్తే మంగళవారం (సెప్టెంబర్ 15) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,408గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి గ్రాము రూ.14,124, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,556 వద్ద కొనసాగుతున్నాయి.
నిన్నటితో పోలిస్తే తులం ధరపై రూ.10 చొప్పున తగ్గుదల నమోదైంది.
10 గ్రాములు (తులం) బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం: రూ.1,54,080
22 క్యారెట్ల బంగారం: రూ.1,41,240
18 క్యారెట్ల బంగారం: రూ.1,15,560
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,408, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,124, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,556గా ఉంది.
విజయవాడ: 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,408, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,124, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,556గా కొనసాగుతోంది.
విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,408, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,124, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,556గా ఉంది.
ఇదే ధరలు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతున్నాయి.
వివరాలు
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మంగళవారం వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది.
అంటే కిలోకు రూ.100తగ్గింది. ఇక వంద గ్రాముల వెండి రూ.24,490,పది గ్రాముల వెండి రూ.2,449 వద్ద కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు:
చెన్నై: రూ.2,49,900
ముంబై: రూ.2,44,900
బెంగళూరు: రూ.2,44,900
హైదరాబాద్: రూ.2,49,900
విజయవాడ: రూ.2,49,900
విశాఖపట్నం: రూ.2,49,900
కోల్‌కతా: రూ.2,49,900
గమనిక: పైన పేర్కొన్నవి మార్కెట్‌లో కొనసాగుతున్న బంగారం,వెండి ధరలు మాత్రమే. వీటికి జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు,ఇతర పన్నులు లేదా రుసుములు కలిపితే తుది కొనుగోలు ధరలో మార్పులు ఉండొచ్చు.ఈ అదనపు ఛార్జీలు కలపకుండా నేటి బంగారం,వెండి రేట్లు ఈ విధంగా ఉన్నాయి.