Loading...
Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన రేట్లు!
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన రేట్లు!

Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన రేట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్ల ప్రభావంతో దేశీయంగా బంగారం,వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు గురువారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు మళ్లీ ధరల భారం తప్పడం లేదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు పెరిగాయి. గురువారం ఉదయం 9.05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో పాటు పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాల ధోరణులు ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి.

వివరాలు 

ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టుకు సంబంధించి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,22,758 వద్ద ట్రేడవుతోంది.

గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,621 పెరిగింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది.

డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,47,298కు చేరింది. గత సెషన్ ముగింపుతో పోలిస్తే కిలో వెండిపై రూ.4,781 పెరిగింది.

వివరాలు 

హైదరాబాద్‌లోనూ భారీగా పెరిగిన ధరలు

ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం,వెండి ధరలు పెరిగాయి.

గురువారం ఉదయం 9.07 గంటలకు bullions.co.in వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,23,300కు చేరింది.

గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,420 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,17,300గా నమోదైంది.

ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,48,000 వద్ద కొనసాగుతోంది.

గత ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.4,260 పెరిగింది.

దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT