Loading...
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పు.. నేటి రేట్లు ఇవే
బంగారం, వెండి ధరల్లో మార్పు.. నేటి రేట్లు ఇవే

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో మార్పు.. నేటి రేట్లు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరల్లో మరోసారి స్వల్ప మార్పు కనిపించింది. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్‌లోని డిమాండ్‌, సరఫరా వంటి అంశాల ప్రభావంతో పసిడి, వెండి ధరలు తరచూ మారుతుంటాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ పరిణామాలు కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇటీవల కొంత తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగగా.. ప్రస్తుతం స్వల్ప మార్పుతో కొనసాగుతున్నాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా అక్టోబర్ 6, మంగళవారం ఉదయం 6 గంటల వరకు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

వివరాలు 

24 క్యారెట్ల బంగారం ధర

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలో రూ.10 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,170గా నమోదైంది.

22 క్యారెట్ల బంగారం ధర

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,740గా కొనసాగుతోంది.

వెండి ధర

వెండి ధరలోనూ స్వల్ప తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,34,900గా ఉంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,740గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,44,900గా కొనసాగుతోంది.

విజయవాడ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదైంది.

ఢిల్లీ: 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,320గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,890గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతోంది.

ముంబై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

నగరాల వారీగా ధరల్లో ఎందుకు తేడా?

చెన్నై: 24క్యారెట్ల పసిడి 10గ్రాముల ధర రూ.1,49,170గా ఉండగా.. 22క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. కిలో వెండి ధర రూ.2,44,900గా నమోదైంది.

బెంగళూరు: 24క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతోంది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో బంగారం,వెండి ధరలు ఒకే విధంగా ఉండవు.

స్థానికంగా ఉన్న డిమాండ్‌,సరఫరా పరిస్థితులతో పాటు రాష్ట్రాల వారీగా విధించే పన్నులు, ఇతర మార్కెట్‌ అంశాల కారణంగా ధరల్లో మార్పులు కనిపిస్తాయి.

అందువల్ల ఒకే రోజున వివిధ ప్రధాన నగరాల్లో పసిడి,వెండి ధరలు కొంత భిన్నంగా ఉండొచ్చు.

బంగారం,వెండి ధరలకు సంబంధించిన తాజా అప్‌డేట్లను తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ADVERTISEMENT