Loading...
Gold Silver Rates: పండగ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పండగ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rates: పండగ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు భారీగా తగ్గాయి.. పండగ వేళ పసిడి ప్రియులకు ఊరట కలిగించే వార్త ఇది. సోమవారం నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు గురువారం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో పండుగల సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కొంత ఊరట లభించింది. ముఖ్యంగా వెండి ధరలు కిలోకు రూ.5,000 తగ్గడం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడం ధరల మార్పునకు కారణంగా చెబుతున్నారు. అక్టోబర్ 29న హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివరాలు 

తగ్గిన వెండి ధరలు

హైదరాబాద్‌లో వెండి ధర కిలోకు రూ.2.15 లక్షలుగా కొనసాగుతోంది. బుధవారం కిలో వెండి ధర రూ.2.20 లక్షలుగా ఉండగా.. గురువారం ఒక్కరోజే రూ.5,000 తగ్గింది.

విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెండి ధర కిలోకు రూ.2.15 లక్షలకు చేరింది.

అక్కడ కూడా ఒక్కరోజులోనే రూ.5,000 తగ్గుదల నమోదైంది. చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2.15 లక్షలుగా ఉంది.

ఈ రెండు నగరాల్లోనూ గురువారం వెండి ధరలు రూ.5,000 తగ్గాయి.

పండుగల సమయంలో వెండితో తయారు చేసిన దేవుడి ప్రతిమలు, పూజా సామగ్రి, నాణేలు కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉంటారు.

ఈ నేపథ్యంలో వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

వివరాలు 

ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువ

ఇక బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950గా ఉంది.

22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,950గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,950గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,950గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,100గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,100గా ఉంది.

హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం.. బంగారం ధరలపై ప్రభావం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ 28 రాత్రి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

ఫెడ్ ఛైర్మన్ కెవిన్ మార్ష్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం.

ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న ఈ నిర్ణయం బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే, నగరాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక బంగారు ఆభరణాల దుకాణాల్లో ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

ADVERTISEMENT