AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది. వచ్చే నెల 3న జరగాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఓట్ల లెక్కింపు తేదీని కూడా 5 నుంచి 7వ తేదీకి మార్చింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ఇటీవల మార్చిన విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా ఈ నెల 30న నిర్వహించాల్సిన ఓట్ల లెక్కింపును వచ్చే నెల 3వ తేదీకి మార్చింది.
వివరాలు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశం
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3న, పరిషత్ ఎన్నికల పోలింగ్ కూడా అదే రోజు జరగాల్సి ఉంది.
దీంతో ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
మరోవైపు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే.