Gold Prices: భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి ధరల్లో మరోసారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. గత వారం రోజుల ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర దాదాపు రూ.5 వేల వరకు తగ్గినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
శుక్రవారం ఉదయం నాటికి దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా అక్టోబర్ 2 ఉదయం 6 గంటల వరకు ఉన్న రేట్లు ఇలా ఉన్నాయి.
వివరాలు
దేశవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,49,230కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు కూడా రూ.10 తగ్గి రూ.1,36,790గా నమోదైంది.
వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై రూ.100 తగ్గి రూ.2,34,900గా కొనసాగుతోంది.
నగరాల వారీగా బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,36,790గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.2,39,900గా కొనసాగుతోంది.
విజయవాడలోనూ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,230, 22 క్యారెట్ల పసిడి రూ.1,36,790గా ఉంది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,900గా నమోదైంది.
వివరాలు
నగరాల వారీగా బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,400గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,940గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900గా కొనసాగుతోంది.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల పసిడి రూ.1,36,790గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900గా నమోదైంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,230గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,790గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900గా కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900గా నమోదైంది.
వివరాలు
నగరాల మధ్య ధరల్లో ఎందుకు తేడా?
బంగారం, వెండి ధరలు దేశంలోని అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్, సరఫరాతో పాటు రాష్ట్ర పన్నులు, ఇతర స్థానిక అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.
అందువల్ల ప్రధాన నగరాల మధ్య పసిడి, వెండి రేట్లలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి.
బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్ తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.