Loading...
Gold,Silver Prices: దిగొస్తున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే?
దిగొస్తున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే?

Gold,Silver Prices: దిగొస్తున్న బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీనికితోడు అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు మదుపర్లను అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో బంగారం, వెండిపై పెట్టుబడుల ఆసక్తి తగ్గి.. ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు సోమవారం ఉదయం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,300గా నమోదైంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి రూ.2.31 లక్షలకు చేరింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర సోమవారం దాదాపు 2.1 శాతం పడిపోయింది. ఔన్సు బంగారం ధర 4,199 డాలర్లకు దిగొచ్చింది. ఒక్క రోజులో ఇంత భారీగా బంగారం ధర తగ్గడం సెప్టెంబరు 1 తర్వాత మళ్లీ ఇప్పుడే చోటుచేసుకుంది.

వెండి కూడా అదే బాటలో..

బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 62 డాలర్లకు పడిపోయింది.

కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో అక్టోబరు డెలివరీ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1.48 లక్షల వద్ద ఉంది. సిల్వర్‌ ఫ్యూచర్స్‌లో కిలో ధర రూ.2.28 లక్షలుగా కొనసాగుతోంది.

వివరాలు 

చమురు ధరలతో ద్రవ్యోల్బణం భయాలు

హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఉద్దేశించిన శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తిరస్కరించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ పరిణామంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 106 డాలర్లకు చేరింది. చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుపైనా అంచనాలు

ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌.. అక్టోబరులో మరోసారి రేట్లను పెంచవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు అమెరికా బాండ్ల ప్రతిఫలాలు 5 శాతానికి పైనే కొనసాగుతున్నాయి. డాలర్‌ సూచీ కూడా 101.39కి పెరిగింది.

రెండు నెలల్లో ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

ఈ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

పెట్టుబడుల డిమాండ్‌ తగ్గడంతో ఈ విలువైన లోహాల ధరలు ప్రస్తుతం దిగొస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT