ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్.. వారిని తొలగించేందుకు రంగం సిద్ధం
ప్రముఖ అమెరికన్ ప్రముఖ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారీగా ఉద్యోగాలపై కోత విధించనుంది. ఏటా ఉద్యోగుల మదింపు ప్రక్రియలో భాగంగా తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. అక్టోబర్ చివరి వారంలో కోతలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక శాతం నుంచి 5 శాతం వరకు కోతలు ఉండొచ్చని సమాచారం. కొవిడ్ కాలంలో ఉద్యోగ కోతలను నిలిపేసిన సాచ్స్, గత జులైలో ఉద్యోగుల పనితీరు ఆధారిత తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు సీఈఓ డేవిడ్ సోలమన్ అన్నారు. గత మేలో సుమారు 250 మంది ఉద్యోగులను సంస్థ తొలగించింది.