Loading...
Airtel voice only plans: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.185 నుంచే కొత్త రీఛార్జి ప్లాన్లు!
ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.185 నుంచే కొత్త రీఛార్జి ప్లాన్లు!

Airtel voice only plans: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.185 నుంచే కొత్త రీఛార్జి ప్లాన్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌ టెల్‌ (Airtel) వినియోగదారుల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్లను (Prepaid Recharge Plans) ప్రకటించింది. కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలతో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ ప్లాన్లను ప్రవేశపెట్టాలన్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) నిబంధనలకు అనుగుణంగా రూ.185, రూ.203, రూ.206 ధరలతో వీటిని తీసుకొచ్చింది. ఈ నిబంధనలకు సంబంధించి ట్రాయ్‌ విధించిన గడువు అక్టోబర్‌ 21తో ముగియనుంది.

వివరాలు

ఎయిర్‌టెల్‌ రూ.185 ప్లాన్‌.. 28 రోజుల వ్యాలిడిటీ

ఎయిర్‌టెల్‌ ప్రకటించిన మూడు ప్లాన్లలో రూ.185 రీఛార్జి ప్యాక్‌ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు మొత్తం 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

డేటా ప్రయోజనాలు మాత్రం ఈ ప్లాన్‌లో ఉండవు.

రూ.203 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ

రూ.203 రీఛార్జి ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులోనూ రూ.185 ప్లాన్‌లో అందించే ప్రయోజనాలే వర్తిస్తాయి.

అంటే అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు 300 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కూడా మొబైల్‌ డేటా, ఓటీటీ వంటి అదనపు ప్రయోజనాలు ఉండవు.

వివరాలు

రూ.206 ప్లాన్‌ ప్రత్యేకత ఏమిటి?

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన మూడో ప్లాన్‌ ధర రూ.206. ఇందులోనూ అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ ప్లాన్‌ క్యాలెండర్‌ నెల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే వినియోగదారులు రీఛార్జి చేసుకున్న నెలలో ఎన్ని రోజులు ఉంటాయో.. అన్ని రోజుల పాటు ఈ ప్యాక్‌ పనిచేస్తుంది.

మిగతా రెండు ప్లాన్లతో పోలిస్తే వ్యాలిడిటీ విషయంలో ఇదే ప్రధాన వ్యత్యాసం.

ADVERTISEMENT

వివరాలు

ఈ ప్లాన్లు ఎవరికి ఉపయోగపడతాయి?

ఎయిర్‌టెల్‌ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో ఈ మూడు రీఛార్జి ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ ప్రయోజనాలు మినహా మొబైల్‌ డేటా, ఓటీటీ వంటి ఇతర ప్రయోజనాలేవీ ఉండవు.

ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వారికి, ఇంటర్నెట్‌ అవసరం లేకపోయినా అపరిమిత కాల్స్‌ కోసం డేటాతో కూడిన రీఛార్జి ప్లాన్లు తీసుకుంటున్న వారికి ఈ ప్యాక్‌లు ఉపయోగపడతాయి.

అలాగే ఇంట్లో లేదా కార్యాలయంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ వినియోగించే వారికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి.

తమ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు రీఛార్జి ఖర్చును తగ్గించుకోవచ్చు.

ADVERTISEMENT