Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో, ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు బంగారం, వెండి ధరలను మరింత పెంచుతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా పరిస్థితి భిన్నంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు పెరగడం కన్నా తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరోసారి ఈ విలువైన లోహాల ధరలు తగ్గాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.100 తగ్గగా, కిలో వెండి ధర కూడా రూ.100 మేర పడిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో ఈ తగ్గుదల వినియోగదారులకు, ముఖ్యంగా మహిళలకు కొంత ఊరటనిస్తోంది.
Details
వినియోగదారులకు ఊరట
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,36,540కు చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 తగ్గి రూ.1,11,720 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా కొంత తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చింది. కిలో వెండి ధర రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,54,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,54,900 వద్ద విక్రయమవుతోంది.