Page Loader
Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు
వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు

Google Pay : వినియోగదారులకు గూగుల్‌ షాక్.. ఇకపై మొబైల్‌ రీఛార్జులపై వసూలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ పేమెంట్ యాప్, గూగుల్‌ పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు పేమెంట్‌ యాప్'లో భాగంగా చేసే మొబైల్‌ రీఛార్జులకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పకనే చెబుతోంది, పేటీఎం, ఫోన్‌పే సంస్థలు ఇప్పటికే ఈ తరహా ఫీజు వసూలు చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి గూగుల్ పే చేరింది. ఇంతకాలం ఉచితంగానే సేవలు అందించిన గూగుల్ పే, ఇప్పుడు ఫీజును వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. రీఛార్జ్ అమౌంట్ ప్రకారం ఛార్జీలు ఆధారపడి ఉంటుందని సమాచారం. కార్డు పేమెంట్, యూపీఐ పేమెంట్‌, పేమెంట్ ఏదైనా కన్వీనియన్స్‌ ఫీజు కట్టాల్సిందేనని అంటోంది. కానీ అది స్వల్ప మొత్తంలోనే వసూలు చేయనుంది.

details

అధికారిక ప్రకటన రాలేదు

గూగుల్‌పేలో ఇటీవలే రీఛార్జ్ చేసిన ఓ యూజర్ తనకు వర్తించిన ఛార్జీలను రిలీజ్ చేశాడు.గూగుల్‌ పే ఉపయోగించి జియో ప్రీపెయిడ్‌ రూ.749 ప్లాన్‌ను రీఛార్జ్ చేయగా, రూ.3 ఫీజును గూగుల్‌ పే వసూలు చేసిందన్నాడు. ఈ క్రమంలోనే జీఎస్టీతో కలిపి మొత్తం రూ.752 చూపించిందని, ఆ మేర స్క్రీన్‌ షాట్ షేర్‌ చేశాడు. అయితే పేమెంట్ యాప్ కొంతమంది యూజర్లకు ఎటువంటి ఫీజును వసూలు చేయట్లేదు. కానీ కొందరి నుంచే ఈ ఛార్జీలు వసూలు చేస్తోంది. భవిష్యత్‌లో అందరి నుంచీ ఫీజు వసూలు చేయనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఛార్జీలపై గూగుల్‌ పే అధికారిక ప్రకటన చేయకపోవడం గమవార్హం.