Fuel Export Duties: పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి సుంకాలు తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉన్న రేట్లతో పోలిస్తే పెట్రోల్‌పై లీటరుకు రూ.1, డీజిల్‌పై రూ.5, ఏటీఎఫ్‌పై రూ.4 చొప్పున కోత విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. సవరించిన సుంకాలు సెప్టెంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా సవరణ ప్రకారం.. పెట్రోల్ ఎగుమతిపై సుంకం లీటరుకు రూ.1.5 నుంచి రూ.0.5కు తగ్గింది. డీజిల్‌పై మొత్తం ఎగుమతి సుంకం రూ.25 నుంచి రూ.20కి చేరింది. ఏటీఎఫ్‌పై సుంకం రూ.19 నుంచి రూ.15కు తగ్గించారు.
వివరాలు
ఈ సుంకాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు
గతంలో డీజిల్‌పై విధించిన లీటరుకు రూ.25 సుంకంలో రూ.24 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED),రూ.1 రహదారి,మౌలిక వసతుల సెస్ (RIC)ఉండేవి.
తాజా నిర్ణయంతో డీజిల్‌పై SAEDను రూ.20కి తగ్గించగా.. RICను పూర్తిగా ఎత్తివేశారు.
సెప్టెంబర్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో డీజిల్ ఎగుమతులపై రహదారి సెస్‌ను సున్నా నుంచి రూ.1కు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సెస్‌ను ఉపసంహరించుకున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడటం,ఎగుమతులను నిరుత్సాహపరచడం కోసం కేంద్రం ఈ ఎగుమతి సుంకాలను మార్చి 27, 2026 నుంచి అమల్లోకి తెచ్చింది.
అంతర్జాతీయంగా ముడిచమురు,పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ధరల సగటు ఆధారంగా ఈ సుంకాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు.
వివరాలు
పెట్రోల్, డీజిల్‌పై అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదు
గత సవరణలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.1.5, డీజిల్‌పై మొత్తం రూ.25, ఏటీఎఫ్‌పై రూ.19 ఎగుమతి సుంకాలు అమల్లోకి వచ్చాయి.
తాజాగా వీటిని తగ్గించారు. అయితే దేశీయ వినియోగానికి ఉద్దేశించిన పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.