Loading...
RCI: డీఆర్‌డీవో ఆర్‌సీఐ డైరెక్టర్‌గా డా. పి.శ్రీహరి నియామకం
డీఆర్‌డీవో ఆర్‌సీఐ డైరెక్టర్‌గా డా. పి.శ్రీహరి నియామకం

RCI: డీఆర్‌డీవో ఆర్‌సీఐ డైరెక్టర్‌గా డా. పి.శ్రీహరి నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త డాక్టర్‌ పి.శ్రీహరి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని మండవల్లి ఆయన స్వస్థలం. డాక్టర్‌ శ్రీహరి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం కోయంబత్తూరులోని పి.ఎస్‌.జి. కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు.

వివరాలు 

'బి' శాస్త్రవేత్తగా..

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఫెలోషిప్‌ కోర్సు (ఎంఈఎఫ్‌సీ) ద్వారా డీఆర్‌డీవోలో చేరిన ఆయన.. 1992లో బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎల్‌ఆర్‌డీఈ)లో 'బి' శాస్త్రవేత్తగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

తొలినాళ్లలో లైట్‌ కాంబాక్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎల్‌సీఏ) కోసం మల్టీమోడ్‌ రాడార్‌ (ఎంఎంఆర్‌) అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యారు.

అనంతరం ఇంటర్‌సెప్టార్‌ క్షిపణుల కోసం డైవర్ట్‌, యాటిట్యూట్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ రూపకల్పన, అభివృద్ధిలో కీలకంగా పనిచేశారు.

2022లో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) కార్యక్రమానికి చెందిన ఏడీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. తాజాగా ఆర్‌సీఐ డైరెక్టర్‌గా నియమితులై బాధ్యతలు చేపట్టారు.

ADVERTISEMENT