Loading...
HDFC Bank: ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. నవంబర్‌ 4 నుంచి కొత్త రేట్లు
నవంబర్‌ 4 నుంచి కొత్త రేట్లు

HDFC Bank: ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. నవంబర్‌ 4 నుంచి కొత్త రేట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD) వడ్డీ రేట్లను సవరించింది. ఈ మార్పులు 2026 నవంబర్‌ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. కొన్ని కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా 0.50 శాతం (50 బేసిస్‌ పాయింట్లు) పెంచింది. తాజా సవరణలతో సీనియర్‌ సిటిజన్లకు మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 7.20 శాతం వడ్డీ లభించనుంది.

వివరాలు 

సాధారణ ఖాతాదారులకు కొత్త వడ్డీ రేట్లు ఎంతంటే?

సాధారణ ఖాతాదారులకు మూడేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ లభిస్తుంది.

60 రోజుల వరకు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్‌ మార్చలేదు.

అయితే 61 రోజుల నుంచి ఆరు నెలల వరకు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. అంటే 0.50 శాతం మేర వడ్డీ రేటు పెరిగింది.

వివరాలు 

దీర్ఘకాలిక డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ

దీర్ఘకాలిక డిపాజిట్లపై బ్యాంక్‌ అత్యధికంగా వడ్డీ రేట్లను పెంచింది.

సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.15 శాతం నుంచి 6.60 శాతానికి పెంచింది.

సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సవరణతో ప్రయోజనం కలగనుంది.

ఇదే కాలపరిమితి డిపాజిట్లపై వారికి గతంలో 6.65 శాతం వడ్డీ లభించగా.. ఇప్పుడు 7.10 శాతానికి పెరిగింది.

దీంతో దీర్ఘకాలిక పొదుపులపై ఖాతాదారులకు మరింత రాబడి లభించనుంది.

ADVERTISEMENT