Page Loader
HDFC Bank Q4 results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 17,616 కోట్లు నికర లాభం 
త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 17,616 కోట్లు నికర లాభం

HDFC Bank Q4 results: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. 17,616 కోట్లు నికర లాభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్‌ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తాజాగా 2024 జనవరి నుండి మార్చి వరకు గల త్రైమాసిక ఆర్థిక వివరాలను వెల్లడించింది. ఈ మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.17,616 కోట్ల నికర లాభాన్ని పొందింది. గత సంవత్సరం ఇదే కాలానికి రూ.16,512 కోట్ల లాభంతో పోల్చితే,ఈసారి లాభం 6.6 శాతం అధికమైంది. అదే విధంగా,ఈ త్రైమాసికంలో సాధించిన మొత్తం ఆదాయం కూడా అంతకుముందు ఏడాదితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.89,639 కోట్లు కాగా,ప్రస్తుత సమయంలో అది రూ.89,488 కోట్లకు చేరిందని బ్యాంక్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా తెలియజేసింది.

వివరాలు 

ఒక్కో షేరుపై ₹22 డివిడెండ్‌

వడ్డీ ఆదాయం పరంగా చూస్తే, ఈ మూడునెలల వ్యవధిలో బ్యాంక్‌ రూ.77,460 కోట్ల వడ్డీ ఆదాయాన్ని పొందింది. 2023 ఇదే త్రైమాసికంలో ఇది రూ.71,473కోట్లుగా ఉండింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్‌ ఒక షేరు కోసం రూ.22 చొప్పున డివిడెండ్‌ చెల్లించనున్నట్లు ప్రకటించింది. నష్టాలలో భాగంగా, స్థూల నిరర్థక ఆస్తులు (Gross NPAs) ఈ త్రైమాసికంలో 1.24శాతం నుంచి 1.33 శాతానికి పెరిగాయి. అలాగే నికర నిరర్థక ఆస్తులు (Net NPAs) కూడా 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఏకీకృత పద్ధతిలో లెక్కించబడిన లాభాల్లో కూడా వృద్ధి నమోదైంది.గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.17,622 కోట్లుగా ఉన్న నికర లాభం,ఇప్పుడు 6.8శాతం పెరిగి రూ.18,835 కోట్లకు చేరింది.

వివరాలు 

బ్యాంక్‌ మొత్తం బ్యాలెన్స్‌షీట్‌ విలువ రూ.39.10 లక్షల కోట్లు

మార్చి 31, 2025 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొత్తం బ్యాలెన్స్‌షీట్‌ విలువ రూ.39.10 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో, గత ఏడాది ఈ విలువ రూ.36.17 లక్షల కోట్లుగా ఉండేది.